తెలంగాణ

telangana

ETV Bharat / state

పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో సంక్షేమం ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలి : కేసీఆర్

KCR Praja Ashirvada Sabha at Khanapur : రాష్ట్రంలో పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఖానాపూర్​లో డిగ్రీ కళాశాలను నిర్మిస్తామని.. రెవెన్యూ డివిజన్​ చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

KCR Comments on DK Shiva Kumar
KCR Praja Ashirvada Sabha in Nirmal

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 2:34 PM IST

Updated : Nov 26, 2023, 3:11 PM IST

KCR Praja Ashirvada Sabha at Khanapur: రాష్ట్రంలో పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో సంక్షేమం ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్​ సూచించారు. కాంగ్రెస్‌ పాలనలో సంక్షేమం ఎలా జరిగిందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్​(BRS) పార్టీ ప్రజా ఆశీర్వాద సభల పేరిట రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలు(KCR Public Meeting) నిర్వహిస్తున్నారు. స్థానిక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే నిర్మల్​ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని.. బీఆర్​ఎస్​ మేనిఫెస్టోను వివరించారు.

10 ఏళ్ల బీఆర్​ఎస్​, 50 ఏళ్ల కాంగ్రెస్​ - ఎవరి పాలన బాగుందో చూసి ఓటేయండి : సీఎం కేసీఆర్​

KCR Praja Ashirvada Sabha in Nirmal : ప్రజలకు ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని.. దాన్ని ఆలోచించి వేయాలని సీఎం కేసీఆర్సూచించారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న పార్టీల చరిత్రను, అభ్యర్థుల గురించి చర్చించుకుని ఓటు వేయాలని అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్​ అధికారంలో ఉందని.. రాష్ట్ర సంపద పెంచి పింఛన్​ అందిస్తున్నామని తెలిపారు. తమ పాలనలో తండాలను గ్రామ పంచాయతీలు చేశామని గుర్తు చేశారు. అనేక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. పోడు పట్టాలను కూడా పంపిణీ చేశామని పేర్కొన్నారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవు - మన దేశంలోనూ అలాంటి విధానం రావాలి : సీఎం కేసీఆర్

"24 గంటలు విద్యుత్ కావాలంటే జాన్సన్‌ నాయక్‌ గెలవాలి. గ్రామాల్లో ప్రజలు చర్చించి ఓట్లు వేయాలి. అభ్యర్థుల గురించి ఆలోచించి ఓటు వేయాలి. ఖానాపూర్​లో డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం. ఖానాపూర్ దత్తత తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. గల్ఫ్​ వెళ్లిన వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అధికారంలోకి వస్తే ఒక రోజంతా ఖానాపూర్​లో ఉండి ఏం కావాలో తెలుసుకుని.. వాటిని పరిష్కరిస్తాను. అనేక వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పోడు పట్టాలను కూడా పంపిణీ చేశాం"- కేసీఆర్​, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

KCR Comments on Congress : 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని.. 3 గంటల విద్యుత్‌ సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(KCR Comments on DK Shivakumar) వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్‌ ఇస్తున్నామని చెప్పారని తెలిపారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్‌ అంటున్నారని మండిపడ్డారు. గతంలో తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్సే అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తాగునీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో సంక్షేమం ఎలా ఉందో ఆలోచించి ఓటు వేయాలి కేసీఆర్

గోదావరి ఒడ్డున ఉన్న ప్రాంతాలకూ కాంగ్రెస్‌ నీళ్లు ఇవ్వలేకపోయింది : సీఎం కేసీఆర్​

ప్రచారంలో దూసుకెళుతున్న బీఆర్​ఎస్​ - నమ్మి ఓటేస్తే మళ్లీ పాతరోజులొస్తాయని హెచ్చరిక

Last Updated : Nov 26, 2023, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details