తెలంగాణ

telangana

భక్తులతో కిటకిటలాడిన గోదావరి తీరం

By

Published : Nov 12, 2019, 3:36 PM IST

కార్తిక పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. సరైన సౌకర్యాలు లేక మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు.

భక్తులతో కిటకిటలాడిన గోదావరి తీరం

కార్తిక పౌర్ణమి సందర్భంగా నిర్మల్ జిల్లా సోన్ గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే భక్తులు తీరానికి చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం గోదావరి నదిలో కార్తిక దీపాలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. గోదావరి తీరంలో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందిపడ్డారు. పుణ్య స్నానానికి వేల మంది భక్తులు రావడం వల్ల పుష్కరగాట్లు కిటకిటలాడాయి. మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

భక్తులతో కిటకిటలాడిన గోదావరి తీరం

ABOUT THE AUTHOR

...view details