తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...! - kaluvaku-gandi

ఆరబెట్టిన పంటలు కుప్పలూడ్చి వెళ్లిన రైతులు... పొద్దునొచ్చి చూసేసరికి కుప్పలన్నీ నీట మునిగిపోయాయి. సాగునీరిచ్చే కాలువకు గండి పడి నీరొచ్చి ధాన్యం తడిసి ముద్దయింది.

ధాన్యం తడిసి ముద్దయ్యాయి

By

Published : Mar 30, 2019, 12:16 PM IST

ధాన్యం తడిసి ముద్దయ్యాయి
నిర్మల్​ జిల్లా భైంసా మండలం వలెగం వద్ద గద్దెన్న కాలువకు గండి పడింది. ఆయకట్టు పరిధిలోచివరి దశలో ఉన్న పంటలకు సాగు నీటిని అందించేందుకు అధికారులు నీటిని విడుదల చేశారు. వేకువజాము 3 గంటల సమయంలో ప్రధాన కాలువకు గండి పడింది. నీటి ప్రవాహంతో ఖాళీస్థలంలో ఆరబోసిన శనగలు, వడ్లు తడిసి ముద్దయ్యాయి.

అధికారుల నిర్లక్ష్యమే...

ఐదు రోజుల క్రితమే కాలువకు చిన్న రంధ్రం పడటం గమనించిన రైతుల తమ సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. కాలువలో పిచ్చిమొక్కలు ఎక్కువ పెరిగినందుననీటికి అడ్డుపడి కాలువకు గండి పడిందని స్థానికులు చెప్పారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నష్టం జరిగిందని రైతులు ఆరోపించారు.

ఆదుకోండి....

ఆరుగాలం పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details