నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామ ప్రజలకు మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొత్తగొల్ల నరేశ్ కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున వారికి కూరగాయలు పంపిణీ చేశారు.
'ప్రజల సహకారంతో కరోనా నియంత్రణ సాధ్యం' - kadthal wise mpp naresh
ప్రజల సహకారంతో కరోనా నియంత్రణ సాధ్యమని నిర్మల్ జిల్లా సోన్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొత్తగొల్ల నరేశ్ అన్నారు. మండలంలోని కడ్తాల్ గ్రామంలో సోమవారం ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు.

కడ్తాల్‌లో పేదలకు కూరగాయల పంపిణీ
రోజురోజుకూ కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు బర్మ నడ్పి గంగన్న, గుర్రం రాము, చింతల ప్రవీణ్ పాల్గొన్నారు.