తెలంగాణ

telangana

ETV Bharat / state

Kadem Project Water Level : కడెం భయం భయం.. మొరాయిస్తున్న 4 గేట్లు.. ప్రజల్లో టెన్షన్ టెన్షన్ - నిర్మల్ కడెం ప్రాజెక్టు

Kadem Project Water Level : నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాది భారీ వరదల సమయంలో ప్రమాదపుటంచుల్లో వెళ్లిన ఈ ప్రాజెక్టుకు అతికష్టం మీద బయటపడింది. ముంపులో ఉన్నంత సేపు పరుగులు తీసిన అధికార యంత్రాంగం.. గట్టెక్కాక అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఏడాది భారీ వర్షాలు, అదే స్థాయిలో వస్తున్న వరదలతో నిన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తే సమయంలో మరోసారి మొరాయించటం అధికారులతో పాటు.. స్థానికులకు ముచ్చెమటలు పడుతున్నాయి.

Kadem
Kadem

By

Published : Jul 27, 2023, 8:29 AM IST

Updated : Jul 27, 2023, 9:04 AM IST

కడెం ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత.. ప్రజల్లో మొదలైనా ఆందోళన

Kadem Project Gates Opened :నిర్మల్ జిల్లాలో 65 ఏళ్ల క్రితం నిర్మించిన కడెం జలాశయం గేట్లు ఈ ఏడాది కూడా మొరాయించాయి. గత సంవత్సరం జులైలోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తి, ఆనకట్టకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురైన విషయం తెలిసిందే. వరద ఉదృతికి జలాశయం నిండు కుండలా మరింది. గేట్లు ఎత్తే సమయంలో రెండు గేట్లు మొరాయించాయి. ఒక్కసారిగా ఏకంగా 6.80 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో ప్రాజెక్టు ముంపునకు గురైంది. వరద గేట్లకున్న మోటార్లన్నీ నీట మునిగాయి.

Kadem Project Gates Lifted: రెండు గేట్ల కౌంటర్ వెయిట్‌లు కొట్టుకుపోయాయి. ఏప్రాన్, స్పిల్వే, గేట్లకు మధ్యనున్న డివైడర్ గోడలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్ట్ దిగువన ఉన్న ప్రజలు రెండు రోజుల పాటు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీశారు. అతికష్టం మీద పరిస్థితి అదుపులోకి రాగా.. అధికార యంత్రాంగం గట్టెక్కింది. ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులు పకడ్బందీగా చేయకుండా పైపై మెరుగులతో నెట్టుకొచ్చారు. వరద వచ్చాక చూద్దామనట్టుగాఅధికారులు వ్యవహరించారు. ఫలితంగా ఈ ఏడాది మరోసారి దిగువ గ్రామాల ప్రజలు ముప్పు ముంగిట బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.

Kadem Project Water Level : శుక్రవారం తెల్లవారుజాము నుంచి వరద ఉద్ధృతంగా రావడంతో అధికారులు మొత్తం 18 గేట్లను ఎత్తేందుకు యత్నించారు. వాటిలో తొమ్మిది మాత్రమే ఎత్తగలిగారు. మిగతా తొమ్మిదింటిలో రెండింటికి కౌంటర్ వెయిట్లు బిగించని కారణంగా, మరో ఏడు సాంకేతిక సమస్యలతో ఎత్తడం ఇబ్బందికరమైంది. విద్యుత్తు మోటార్ల ద్వారా గేట్లు పైకిలేవకపోవడంతో స్థానిక యువకులు, సిబ్బంది కలిసి చేతులతో హాండిల్ తిప్పుతూ అతికష్టం మీద మూడింటిని ఎత్తగలిగారు. సాయంకాలం వరకు నిపునుల సహాయంతో మరో రెండు గేట్లను పాక్షికంగా ఎత్తారు. 14 గేట్లద్వారా ఎగువ నుంచి వచ్చిన 3.8 లక్షల క్యూసెక్కుల వరదను అదే స్థాయిలో కిందికి వదిలారు.

ప్రతి ఏడాది ఇదే పరిస్థితి : రెండేళ్లుగా కడెం జలాశయం వరదగేట్లకుసాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది వర్షాకాలానికి సిద్ధంగా ఉంచాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రాజెక్టు సందర్శనకు మేలో వచ్చిన ఈఎన్‌సీ బృందం కౌంటర్ వెయిట్లను జూన్ పది నాటికి బిగించాలని ఆదేశించినా.. సరైన స్పందనరాలేదు. ఏప్రాన్, స్పిల్వే, డివైడర్ వాల్స్ మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.44 కోట్లను ఆలస్యంగా మంజూరు చేయడంతో టెండరు పూర్తవక పనులను చేపట్టలేదు. దెబ్బతిన్న వరద గేట్లను, మోటార్లను స్థానిక సిబ్బందితోనే మరమ్మతు చేయించారు. ఈ నిర్లక్ష్యం కారణంగా మరోసారి గేట్లు మొరాయించాయి. తరచుగా తలెత్తుతున్న సమస్యలు, భారీ వరదల వేళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కడెం ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 27, 2023, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details