తెలంగాణ

telangana

ETV Bharat / state

Kadem Project Gates Repair : కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న కష్టకాలం .. విరిగిన మరో గేటు - Kadem project gates problems

Kadem Project Gates Repair in Nirmal District : కడెం జలాశయం వరదగేట్ల సమస్య తీరడంలేదు. గతేడాది వరదల సమయంలో రెండు, మూడు నెంబర్ గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోగా.. వాటిని తయారుచేయించే పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ ఏడాది జులైలో ఎనిమిదో గేటు కూడా పక్కకు జరిగింది. ఇప్పుడు 15వ నంబర్‌ గేటు కౌంటర్‌ వెయిట్‌ విరిగిపోయి నీళ్లు వృథాగా పోతున్నాయి. దీంతో 65,000 ఎకరాల ఆయకట్టుపై ప్రభావం చూపనుంది.

Nirmal district
Kadem project

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 9:46 AM IST

Kadem Project Problems కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న కష్టకాలం

Kadem Project Gates Repair in Nirmal District : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వరప్రదాయిని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) కష్టకాలం కొనసాగుతోంది. జలాశయం వరద గేట్ల సమస్యలు వెంటాడుతున్నాయి. 15వ నంబర్‌ గేటు కౌంటర్‌ వెయిట్‌ విరిగిపోయింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత వరదనీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు 15వ నంబర్ గేటు ఎత్తే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా పెద్దశబ్దంతో విరిగిపోయింది. దీనికి అనుసంధానమైన రోప్‌లు ఊడిపోయి కౌంటర్‌ వెయిట్‌కు ఆధారంగా ఉండే సిమెంట్‌ దిమ్మె కూలి నీళ్లలో పడిపోయింది.

Kadem Project Flood Gates Problems : ఒక్కసారిగా గేటు (Flood Gates) కిందకు పడిపోవడంతో ట్రాక్‌ పక్కకు జరిగింది. దీంతో జలాశయం నుంచి దాదాపు 3,000 నుంచి 4,000 క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్తోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,000 క్యూసెక్కుల వరదమాత్రమే వస్తుండగా.. ప్రస్తుతం 7 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు కింద మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల పరిధిలో 65,000 ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. కౌంటర్‌ వెయిట్‌ విరిగిపోవడం, గేటు పక్కకు జరగడం పెద్ద ప్రమాదమేమి కాదని ఇంజినీర్లు చెబుతున్నారు.

Kadem Project Danger Zone : ప్రమాదకరంగా కడెం జలాశయం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

Kadem Project Flood Gates Repairs Delay :ఎస్ఈ సుశీల్ కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాస్, సిబ్బంది గేటును పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబాద్ నుంచి మెకానికల్ బృందాన్ని పిలిపిస్తున్నామని తెలిపారు. అయితే తక్షణమే మరమ్మతులు సాధ్యమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఒకటో నెంబర్‌ గేటు కౌంటర్‌ వెయిట్‌ ఇదే రీతిలో విరిగిపోయి పక్కకు జరిగింది. మరమ్మతులు చేసినప్పటికి లీకేజీ కొనసాగుతోంది. చివరకు జలాశయాన్ని ఖాళీ చేసి బాగు చేశారు.

Kadem Project Water Flood : కడెం జలాశయానికి పోటెత్తిన వరద.. పని చేయని 7 గేట్లు

తర్వాత వచ్చిన వరదనీటిని నిల్వ చేశారు. గతేడాది జులైలో వచ్చిన వరదల సమయంలో రెండు, మూడు నెంబర్ గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోగా.. వాటిని తయారుచేయించే పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ ఏడాది జులైలో ప్రాజెక్టు ఎనిమిదో గేటు కూడా పక్కకు జరిగింది. పైకి తెరిచే క్రమంలో రోప్‌ ఊడిపోయి పక్కకు జరిగినా.. ఇప్పటికి మరమ్మతు చేయించలేదు. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో నాలుగు పనిచేయడంలేదు.

Kadem Narayana Reddy Project :మిగిలినవి తెరుచుకోవడంలో లోపాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది వరదలు వచ్చినప్పుడు గేట్లు మొరాయింపుతో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టులోని లోపాలపై నీటిపారుదల శాఖ అధ్యయనాలు నిర్వహించింది. అయితే ఈ లోపుగానే పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

కడెం ప్రాజెక్టుకు మరో ముప్పు.. గేట్ల నుంచి దిగువకు తరలిపోతున్న నీళ్లు

Kadem Project Damage :మరోవైపుకడెం ప్రాజెక్టుకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆధునికీకరించాలని గత సంత్సరమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే దీనిపై గత నెలలో నివేదిక సమర్పించింది. భారీ వరద వెళ్లేందుకు వీలుగా స్పిల్‌వే ఏర్పాటు చేయాలని.. అదనపు గేట్లు నిర్మించాలని, పాత గేట్ల స్థానంలో అధునాతన వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు సిఫార్సులు చేసింది. వీటన్నింటికి గాను సుమారు రూ.250 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనా వేశారు.

Kadem Project Water Level : శాంతించిన కడెం జలాశయం.. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

Kadem Project Water Level : కడెం భయం భయం.. మొరాయిస్తున్న 4 గేట్లు.. ప్రజల్లో టెన్షన్ టెన్షన్

ABOUT THE AUTHOR

...view details