తెలంగాణ

telangana

ETV Bharat / state

Kadem Project Damage : కడెం ప్రాజెక్టును ఏం చేద్దాం.. మరమ్మతా.. మోడర్నైజేషనా.. ఏది బెటర్..? - సీఎం కేసీఆర్ తాజా వార్తలు

Kadem Project Damage: నిర్మల్​ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆధునికీకరించాలని గతేడాదే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కడెం ప్రాజెక్టుకు ఆకస్మిక వరదలు వస్తుండటంతో ముప్పు ఏర్పడుతున్నట్లు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద కడెం ఉన్నప్పటికీ వరదను ముందుగా అంచనా వేసే సెన్సార్ల ఏర్పాటులో జాప్యం జరుగుతుండటం చర్చనీయంగా మారింది. ఈ విషయమై గత నెలలో సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేసినా.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

Kadem Project
Delay in Modernization of Kadem Project

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2023, 1:54 PM IST

Kadem Project Damage :నిర్మల్‌ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు(Kadem Narayana Reddy Project)ను ఆధునికీకరించాలా.. అత్యవసర మరమ్మతులు చేపట్టాలా అనే విషయమై నీటిపారుదల శాఖ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ ప్రాజెక్టు గతేడాది వర్షాలకు తీవ్ర ముప్పును ఎదుర్కొంది. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే కడెం ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం.. డ్యాం సేఫ్టీ రివ్యూ కమిటీని ఏర్పాటు చేయగా గత నెలలో కమిటీ నివేదిక సమర్పించింది. ఇదిలా ఉండగా.. తాజాగా నలుగురు సభ్యులతో కూడిన మరొక కమిటీని ఏర్పాటు చేసింది.

Kadem Project Modernization News :ఈ కడెం ప్రాజెక్టును 65 ఏళ్ల కిందట నిర్మించగా.. 18 గేట్లు ఉన్నాయి. వాటిలో తొమ్మిది గేట్లను జర్మనీ సాంకేతికతతో ఏర్పాటు చేశారు. 65 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈకడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.5 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్లే నీటి సామర్థ్యం 3.60 లక్షల క్యూసెక్కులైతే.. గతేడాది జులైలో 6 లక్షలు క్యూసెక్కుల వరద వచ్చింది. అయితే గేట్లు మొరాయించడమే కాకుండా.. వాటిని పైకి కిందకు నడిపించే కౌంటర్‌ వెయిట్స్‌ ఆ వరదలో కొట్టుకుపోయాయి. అలాగే గత నెలలో కూడా 3.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. మళ్లీ గేట్లు మొరాయించగా.. స్థానిక ప్రజలు ఇంజినీర్లకు సాయం చేయాల్సి వచ్చింది.

Kadem Project Danger Zone : ప్రమాదకరంగా కడెం జలాశయం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..?

Kadem Project Repair :కడెం ప్రాజెక్టుకు ఆకస్మిక వరదలు(Flash Floods) వస్తుండటంతో ముప్పు ఏర్పడుతున్నట్లు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. జలాశయం వెనుక భాగంలో ప్రవాహాలు వచ్చే స్ట్రీమ్స్‌పై సెన్సర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిపుణులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నేషనల్‌ హైడ్రాలజీ ప్రాజెక్టు(National Hydrology Project) కిందకడెం ఉన్నప్పటికీ వరదను ముందుగా అంచనా వేసే సెన్సర్ల ఏర్పాటులో జాప్యం జరుగుతుండటం చర్చనీయంగా మారింది. ఈ విషయమై గత నెలలో సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేసినా.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

Kadem Project Water Flood : కడెం జలాశయానికి పోటెత్తిన వరద.. పని చేయని 7 గేట్లు

ఏం చేయబోతున్నారో.. :కడెం ప్రాజెక్టుకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆధునికీకరించాలని గతేడాదే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే దీనిపై గత నెలలో నివేదిక సమర్పించింది. భారీ వరద వెళ్లేందుకు వీలుగా స్పిల్‌వే ఏర్పాటు చేయాలని, అదనపు గేట్లు నిర్మించాలని, పాత గేట్ల స్థానంలో అధునాతన వ్యవస్థ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు సిఫార్సులు చేసింది. వీటన్నింటికీ గాను సుమారు రూ.250 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా మరో కమిటీని ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సీఈ, ఆదిలాబాద్‌ సీఈ, ఓ అండ్‌ ఎం ఎస్‌ఈ, మెకానికల్‌ డివిజన్‌ నుంచి ఒక ఇంజినీరును ఇందులో సభ్యులుగా చేర్చింది. డీఎస్‌ఆర్‌సీ సిఫార్సులను అమలుకు ఎక్కువ సమయం తీసుకోనున్నందున అత్యవసరంగా ఏం చేయాలనే దానిపై తాజా కమిటీ దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే వచ్చే సోమవారం దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Kadem Project Water Level : శాంతించిన కడెం జలాశయం.. ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

Kadem Project Water Level : కడెం భయం భయం.. మొరాయిస్తున్న 4 గేట్లు.. ప్రజల్లో టెన్షన్ టెన్షన్

ABOUT THE AUTHOR

...view details