తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: జూలకంటి - tsrtc strike latest news

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. నిర్మల్​లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన ఆయన... ప్రభుత్వ విధానం పట్ల మండిపడ్డారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి.. వారి డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: జూలకంటి

By

Published : Oct 25, 2019, 8:54 PM IST

ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లడానికి ప్రభుత్వమే కారణమని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే తన పదవికి సెల్ఫ్​ డిస్మిస్​ చేసుకోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు పెంచేందుకు డబ్బులున్నాయి కానీ... కార్మికులకు జీతాలు పెంచేందుకు డబ్బులు లేవనడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పటికీ విద్య, వైద్యం, విద్యుత్, రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు వెనక ఉండి రెచ్చగొడుతున్నారని సీఎం అనడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: జూలకంటి

ABOUT THE AUTHOR

...view details