ప్రధాని పిలుపుతో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల ప్రజలంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆదివారం వచ్చిందంటే భక్తజనంతో కిక్కిరిసిపోయే అడెల్లి మహాపోచమ్మ దేవస్థానం భక్తులు లేక బోసిపోయింది. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆస్థాన పూజారులు నిత్య పూజలు చేసి ధూపదీప నైవేద్యాల సమర్పణ అనంతరం ఆలయాన్ని మూసివేశారు.
ప్రజలంతా జనతా కర్ఫ్యూలో... బోసిపోయిన ఆలయాలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాలు బోసిపోయాయి. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి.
ప్రజలంతా జనతా కర్ఫ్యూలో... బోసిపోయిన ఆలయాలు
అడెల్లి మహాపోచమ్మ దేవస్థానం ఆదివారం వచ్చిందంటే భక్తజనంతో కిక్కిరిసిపోయేది. పక్క రాష్ల్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు.
ఇదీ చూడండి:అప్రమత్తతే వైరస్‌కు విరుగుడు.. ఇది ప్రతి పౌరుడి బాధ్యత