తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్మల్​ జిల్లాలో ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష - ఇంటర్​ గురుకుల ప్రవేశ పరీక్ష వార్తలు నిర్మల్​ జిల్లా

నిర్మల్​ జిల్లాలో జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఇంటర్​, డిగ్రీ కళాశాల ప్రవేశం కోసం మొత్తం 1399 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 885 మంది పరీక్ష రాయగా.. 534 మంది గైర్హాజరయ్యారు.

నిర్మల్​ జిల్లాలో ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
నిర్మల్​ జిల్లాలో ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

By

Published : Sep 30, 2020, 6:36 PM IST

జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం కోసం బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంటర్​లో ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని 8 పాఠశాలల్లో కేటాయించగా.. డిగ్రీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం వాసవి ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఇంటర్​, డిగ్రీ కళాశాల ప్రవేశం కోసం మొత్తం 1399 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 885 మంది పరీక్ష రాయగా.. 534 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జూనియర్ కళాశాలలో 1210 మంది విద్యార్థులకు గాను 779 మంది విద్యార్థులు హాజరుకాగా 481 మంది గైర్హాజరయ్యారు.

డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశం కోసం 189 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 86 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 109 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష సందర్భంగా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:ఆదిలాబాద్​ జిల్లాలో ప్రశాంతగా గురుకుల పరీక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details