తెలంగాణ

telangana

ETV Bharat / state

Basara RGUKT food issue : మొన్న కూరలో కప్ప.. ఇవాళ ఉప్మాలో పురుగు - ఆర్జీయూకేటీలో ఆహారంలో పురుగులు

Basara RGUKT food issue: ఉన్నత విద్యకు కేరాఫ్‌గా నిలిచిన బాసర ఆర్జీయూకేటీలో ఆహారం విషయంలో మాత్రం యాజమాన్యం నాణ్యత పాటించడం లేదు. గత కొద్ది రోజులుగా తినే ఆహారంలో, తాగే నీటిలో కీటకాలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న తినేకూరలో కప్ప.. నిన్న అన్నంలో సాలెపురుగు.. తాగే నీటిలో బల్లులు, కప్పలు వస్తున్నాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.

Basara RGUKT food issue
Basara RGUKT food issue

By

Published : Mar 10, 2022, 10:00 AM IST

Basara RGUKT food issue : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో ఆహారంలో కీటకాలు రావడం కలవరం కలిగిస్తోంది. ఉన్నతవిద్యకు కేరాఫ్‌గా నిలిచే విశ్వవిద్యాలయంతో తరచూ ఈ ఘటనలు చోటుచేసుకోవడం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. విద్యార్థులు తినే ఆహారంలో కీటకాలు.. తాగే నీటిలో బల్లులు, కప్పలు దర్శనమిస్తున్నాయి.

Insects in Food at RGUKT : బుధవారం రోజున ఉప్మా తింటున్న విద్యార్థికి అందులో పురుగు కనిపించింది. ఆగ్రహానికి లోనైన విద్యార్థి ఇతర విద్యార్థులతో కలిసి యాజమాన్యాన్ని నిలదీశాడు. ఆహారంలో కీటకాలు వస్తున్నాయని వారం రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డాడు. ఇది ఇలాగే కొనసాగితే తమ ఆరోగ్యం పాడవుతుందని వాపోయారు.

Insects in Food at RGUKT Basara : మరోవైపు విద్యార్థులు తినే ఆహారం.. తాగే నీటిలో కీటకాలు రావడంపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకోవడానికి తమ పిల్లలను పంపిస్తే వారికి సరైన తిండి పెట్టడం లేదని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరారు.

సంబంధిత కథనాలు :

ABOUT THE AUTHOR

...view details