తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసా మార్కెట్​లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం

భైంసా మార్కెట్​లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ముధోల్​ ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి, మార్కెట్​ అధికారులు ప్రారంభించారు. క్వింటాలు పత్తికి మద్దతు ధర రూ.5,825 చెల్లిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Initiation of cotton purchases by CCI in Bhainsa market in nirmal district
భైంసా మార్కెట్​లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం

By

Published : Nov 5, 2020, 2:39 PM IST

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మార్కెట్ అధికారులు ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.

రైతులు కూడా తాము పండించిన పత్తి పంటలో తేమ శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా రైతులు సీసీఐకే పత్తి పంటను అమ్ముకోవాలని తెలిపారు. క్వింటాలు పత్తికి మద్దతు ధర రూ.5,825 చెల్లిస్తున్నామని అన్నారు.

ఇవీ చూడండి: ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. దళారులను నమ్మొద్దు: పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details