నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, ఉద్యోగుల పర్యటన, విధులకు హాజరవుతున్న సమయం, తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ఆయన పరిశీలించారు.
సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి
విధి నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలించడం వల్ల ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌లోని కలెక్టరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ఆయన ప్రారంభించారు.
సెంట్రల్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి
ఈ విధానానికై పాలనాధికారి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ విధానం అన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలందుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ