తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టాలిచ్చారు.. లాక్కుంటున్నారు న్యాయం చేయండి' - latest news of nirmal district

అప్పుడు పట్టాలిచ్చారు.. ఇప్పుడు లాక్కుంటున్నారు అంటూ నిర్మల్​ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు.

indiramma-houses-holders-protest-in-nirmal
పట్టాలిచ్చారు.. లాక్కుంటున్నారు న్యాయం చేయండి

By

Published : Dec 4, 2019, 8:13 PM IST

అయ్యా.. మేం గరీబోళ్లం. ఆ కాంగ్రెసోళ్లు ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ తెరాస వాళ్లు ఆ ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారు. మీరే న్యాయం చేయండి అంటూ నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఇందిరమ్మ ఇళ్ల స్థలాల బాధితులు ఆందోళన చేశారు. 2008లో నిరుపేదలకు మహాలక్ష్మి ఆలయ సమీపంలో గొల్లపేట్‌కు చెందిన 30 మంది దళితులకు కాంగ్రెస్‌ పార్టీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది.

మేము నిరుపేదలం కావడం వల్ల ఇళ్లు నిర్మించుకోలేకపోయాం. ఇప్పుడు ఆ స్థలాలు మావే అంటూ పట్టణానికి చెందిన ఓ తెరాస నేత మమ్మల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ కట్టుకున్న పునాదులను కూల్చివేస్తున్నారని బాధితులు వాపోయారు. అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

పట్టాలిచ్చారు.. లాక్కుంటున్నారు న్యాయం చేయండి

ఇదీ చూడండి: సోయి లేకుండానే దారుణాలు..!

ABOUT THE AUTHOR

...view details