తెలంగాణ

telangana

ETV Bharat / state

హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం - నిర్మల్ పట్టణం వైఎస్ఆర్ నగర్ కాలనీలో హత్య

వివాహేతర సంబంధం నేపథ్యంలో.. ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిర్మల్ పట్టణం వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చోసుకుంది. ఒకరిని అరెస్టు చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

In the wake of extramarital affairs ... In the YSR Nagar colony of Nirmal town
హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

By

Published : May 28, 2020, 4:08 PM IST

నిర్మల్ పట్టణం వైఎస్ఆర్ నగర్ కాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో... దారుణ హత్య జరిగింది. గోదావరి అనే మహిళను అదే కాలనీకి చెందిన యువకుడు కిషోర్ మూడేళ్ల క్రితం తీసుకుని మరో ఊరికి వెళ్లిపోయాడు.

రెండు రోజుల క్రితం ఇద్దరు వైఎస్ఆర్ కాలనీకి తిరిగొచ్చారు. దీంతో గోదావరి భర్త బాబు, కిషోర్ కుటుంబాల మధ్య గొడవ జరిగింది.మారుతి అనే వ్యక్తి జోక్యం చేసుకుని గొడవ అడ్డుకోబోయాడు. ఈక్రమంలో మారుతి, కిశోర్ మధ్య వాగ్వివాదం ముదిరింది. పక్కనే ఉన్న బండరాయితో కిషోర్​ను మోది మారుతి హత్యచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు మారుతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

ABOUT THE AUTHOR

...view details