Huge Floods To Telangana Projects :రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలు, హైదరాబాద్ పరివాహక ప్రాంతాల్లోనిజలాశయాలకు జలకళ సంతరించుకుంది. గత 45 రోజుల ముందు నాటి పరిస్థితులు ఆ జలాశయాల వద్ద కనిపిస్తున్నాయి. కొన్నింటి వద్ద పూర్తిస్థాయికి మించి నీరు ప్రాజెక్టుల్లో చేరడంతో.. వచ్చిన నీరును వచ్చినట్లు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
Sriram Sagar Project Gates Opened :ఈ క్రమంలోనిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project)కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 89వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరతుండగా.. 21 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 3000 క్యూసెక్కులు.. ఎస్కేప్ గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల(Cusec) నీటిని బయటకు పంపించేస్తున్నారు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తిగా నిండిపోయింది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీ(TMC)లుగా ఉంది.
Telangana Heavy Rains Today : రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం.. జలమయమయిన ప్రాంతాలు
Kadem Project Water Flow in Nirmal :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. ఇప్పటికే నిండు కుండలా మారిన జలాశయం నుంచి రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696 అడుగులుగా ఉంది. ప్రాజెక్టులోకి 34400 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. దిగువకు 27224 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.