తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం - హోంగార్డులు తాజా వార్త

చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పి తమ పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ చూపాలని.. ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలని నిర్మల్​ జిల్లా ఎస్పీ శశిధర్​ సూచించారు. హోమ్​గార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్మల్​ జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.

home-guards-foundation-day-celebrations-in-nirmal
ఘనంగా హోంగార్డులు వ్యవస్థాపక దినోత్సవం

By

Published : Dec 6, 2019, 4:29 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలో హోమ్ గార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి గ్రామీణ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నిస్వార్థ సేవయే మా లక్ష్యం, హోంగార్డులు వర్ధిల్లాలి, పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ శశిధర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.

హోంగార్డులు తమ విధులకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించాలని కోరారు. చెడు వ్యసనాలను వదిలేయాలని, ఖాకీ దుస్తుల హుందాతనాన్ని కాపాడాలని తెలిపారు. విధుల నిర్వహణతో పాటు తమ పిల్లల భవిష్యత్తు, వారి ఎదుగుదలపై శ్రద్ధ చూపాలని సూచించారు. హోంగార్డ్ ఉద్యోగులందరికీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఘనంగా హోంగార్డులు వ్యవస్థాపక దినోత్సవం

ఇదీ చూడండి: మహబూబ్​ నగర్​లో పోలీసులు భారీ బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details