నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హోలీ సంబురాలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సినిమా పాటలకు పలువురు ఉత్సాహంగా స్టెప్పులేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏటా నిర్వహించే శోభాయాత్ర ఈసారి జరపడం లేదని తెలిపారు.
విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు - తెలంగాణ వార్తలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సినిమా పాటలకు ఉత్సాహంగా స్టెప్పులేశారు.
నిర్మల్‌లో హోలీ వేడుకలు, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పతికే రాజేందర్, ఉపాధ్యక్షుడు దొనగిరి మురళీ, పట్టణ అధ్యక్షుడు ముప్పిడి రవి, భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడు మహోరం కపిల్, పట్టణ అధ్యక్షులు దర్శనం రాకేశ్, హిందూవాహిని జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి సాయి, నాయకులు మెడిసెమ్మ రాజు, గిల్లి విజయ్, కౌన్సిలర్ ఎడిపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై తెరాసకు చిత్తశుద్ధి లేదు: రఘునందన్