తెలంగాణ

telangana

ETV Bharat / state

భైంసా మార్కెట్​లో రికార్డు స్థాయిలో ఎర్ర కందుల ధర - తెలంగాణ వార్తలు

భైంసా మార్కెట్​ యార్డులో ఎర్ర కందులకు రికార్డు స్థాయిలో ధర నమోదైంది. గరిష్ఠంగా క్వింటాలుకు రూ.7,291 పలికింది. సోమవారం నాటికి మొత్తం 11,665 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

highest-price-to-red-grams-at-bhainsa-marketyard-in-nirmal-district
భైంసా మార్కెట్​లో రికార్డు స్థాయిలో ఎర్ర కందుల ధర

By

Published : Feb 9, 2021, 6:44 PM IST

నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్​లో ఎర్ర కందులకు రికార్డు స్థాయిలో ధర నమోదైంది. సోమవారం రోజు గరిష్ఠంగా క్వింటాకు రూ.7,291, కనిష్ఠంగా రూ.4,517 ధర నమోదైంది. మంగళవారం గరిష్ఠంగా రూ.7,088, కనిష్ఠంగా రూ.5,200 పలికింది. సోమవారం వరకు భైంసా మార్కెట్ యార్డులో 11,665 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనామ్ పద్ధతిలో కందుల కొనుగోళ్లు జరుగుతున్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ తెలిపారు. ఈ ఏడాది రూ.6వేల మద్దతు ధర ప్రకటించిందని... భైంసా మార్కెట్​లో మొదటి నుంచి రూ.5,200 ధర నమోదైందని పేర్కొన్నారు. ఎర్ర కందులకు రాష్ట్రంలోనే అత్యధిక ధర పలికిందని... ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ సీజన్​లో మొత్తం 25వేల క్వింటాళ్ల వరకు ఎర్ర కందులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:నల్గొండ నుంచి హైదరాబాద్​కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాదయాత్ర

ABOUT THE AUTHOR

...view details