నిర్మల్ జిల్లా బాసర మండలంలోని పలు గ్రామాల్లో కోళ్లకు వింత వ్యాధి సోకి కోళ్లన్నీ మృత్యువాత పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కిర్గుల్ గ్రామంలో కోళ్లు చనిపోవడం వల్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పశువైద్య అధికారులు వచ్చి పరిశీలించారు. ఇది వింత వ్యాధి కాదని... మూర్ఛ వ్యాధి అని నిర్ధారించారు.
కోళ్లకు వచ్చేది బర్డ్ ఫ్లూ కాదా? వైద్యాధికారులు ఏమంటున్నారు? - telangana news
వింత వ్యాధి సోకి పలు గ్రామాల్లో కోళ్లన్నీ మృత్యువాత పడుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని కిర్గుల్ గ్రామాన్ని పశు వైద్యాధికారులు సందర్శించి కోళ్లను పరిశీలించారు. ఆ వ్యాధి బర్డ్‌ఫ్లూ కాదని నిర్ధారించారు.
బాసర మండలంలో కోళ్లు చాలా వరకు చనిపోతున్నాయని... అందులో కిర్గుల్ గ్రామంలో కోళ్లు ఎక్కువగా చనిపోవడం వల్ల గ్రామాన్ని సందర్శించి కోళ్లను పరిశీలించామని పశువైద్యాధికారి తెలిపారు. కోళ్లకు వస్తున్న వ్యాధి బ్లడ్ఫ్లూ కాదని... ఆర్డీ మూర్ఛ వ్యాధి అని శవపరీక్ష ద్వారా నిర్ధారించామని ఆయన తెలిపారు. ఈ అంటువ్యాధి కోళ్లకు మాత్రమే సోకుతుందని వెల్లడించారు. ఈ మూర్ఛ వ్యాధికి టీకాలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఇవీ చదవండి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పశువులు మృతి