తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షంతో కుదేలైన రైతు

కరోనా దెబ్బకు ఇప్పటికే కుదేలైన రైతులకు అకాల వర్షం కోలుకోని దెబ్బ తీసింది. రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. అరుగాలం కష్టపడి పండించిన పంట అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది.

Heavy rain in Nirmal district Rain-stained rice grain at rice purchase centres
అకాల వర్షంతో కుదేలైన రైతు

By

Published : May 11, 2020, 12:34 PM IST

నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులతో వర్షం పడింది. గాలి-వాన ధాటికి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయింది. వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

కరోనా దెబ్బతో పంట అమ్ముకోవడానికి లేక అన్నదాతలు నానా అవస్థలు పడుతున్న సమయంలో ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మామిడి కాయలు నేలరాలాయి.

ABOUT THE AUTHOR

...view details