నిర్మల్లో జోరుగా వాన కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘాలు కమ్ముకుని నేలకు జారడం పల్ల వాతావరణం పూర్తిగా చల్లబడింది. అయితే రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ శాఖ కార్యాలయం వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది.
నిర్మల్లో జోరు వాన... వాహనదారుల ఇక్కట్లు - weather report in nirmal
నిర్మల్ పట్టణంలో జోరు వాన కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడినప్పటికీ చిరువ్యాపారులు, వానహనాదరులు ఇక్కట్లు పడ్డారు.
నిర్మల్లో జోరు వాన... వాహనదారుల ఇక్కట్లు
పట్టణంలోని గాంధీ కూరగాయల మార్కెట్, రాంనగర్, ఇంద్రానగర్, ఎన్టీఆర్ మార్గ్, విశ్వనాథ్పేట్కాలనీలలో వర్షపునీరు రోడ్డుపైకి రావడం పల్ల స్థానికుల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు.
ఇదీ చూడండి:ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల