నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామానికి దగ్గరలో ఉన్న పోచమ్మ చెరువు కట్టపై నుంచి నీరు పొంగి ప్రవహించడం వల్ల గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోగంట పాటు వర్షం కొనసాగితే.. కట్ట తెగిపోతుందేమోనని ప్రజలు భయపడుతున్నారు.
పోచమ్మ చెరువుకట్టపై వరద ఉద్ధృతి.. ఆందోళనలో ప్రజలు
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముద్గల్ గ్రామం జలదిగ్బంధం కావడం వల్ల పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పోచమ్మ చెరువుకట్టపై వరద ఉద్ధృతి.
భైంసా మండలంలోని దేగామ్ గ్రామం నుంచి ఇలెగాం గ్రామానికి రహదారి మధ్యలో ఉన్న వాగుపై నీరు ప్రవహించడం వల్ల దేగామ్ గ్రామంలోని కొన్ని ఇళ్లు, సెల్ టవర్, శ్మశానవాటిక కూడా నీట మునిగాయి. పలుచోట్ల వాగులు పొంగిపొర్లడం వల్ల పంట పొలాలు నీట మునిగి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
బాసరలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతంలోని రవీంద్రపూర్ కాలనీలో సుమారు 17 ఇళ్లు జలదిగ్బంధమయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు జేసీబీతో నీటిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు.
- ఇదీ చూడండివర్షం వస్తే... ఈ ఊరు జలదిగ్బంధం అవుతుంది