నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి సైతం వర్షం కురవడంతో ఉదయమంతా ఉక్కపోత ఎక్కువైంది. సాయంత్రం కురిసిన వర్షంతో జిల్లా వాసులు సేదతీరారు.
నిర్మల్‌లో బీభత్సం సృష్టించిన గాలివాన - నిర్మల్‌లో గాలి వాన బీభత్సం
ఈదురు గాలులతో కూడిన గాలి వర్షం నిర్మల్ జిల్లా కేంద్రంలో బీభత్సం సృష్టించింది. రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
![నిర్మల్‌లో బీభత్సం సృష్టించిన గాలివాన heavy-rain-in-niraml-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7567635-thumbnail-3x2-rain.jpg)
నిర్మల్‌లో బీభత్సం సృష్టించిన గాలివాన
ఈదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. రహదారులపై చెట్లు పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు కాస్త అంతరాయం ఏర్పడింది. అనంతరం విద్యుత్ సిబ్బంది మరమ్మత్తులు చేశారు.
ఇవీ చూడండి:శిశువును పీక్కుతిన్న శునకాలు