నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాలకు చెందిన హన్సిక రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం సీఈసీ చదువుతోంది. కొద్దిరోజులుగా ఆమె గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంటర్ పరీక్షలు సమీపించాయి.
పరీక్షలు తప్పితే ఉన్నత విద్య చదువుకోవడం కష్టమవుతుందని భావించిన విద్యార్థిని పరీక్ష రాసేందుకు సిద్ధమైంది. తనకు సాయంగా మరొకరు పరీక్ష రాయాలని తాను సమాధానాలు చెప్తానని అధికారులకు విన్నవించుకుంది. విద్యార్థిని పట్టుదలను మెచ్చిన అధికారులు ఆమె అభ్యర్థనను అంగీకరించారు.