నిర్మల్ జిల్లా నిర్మల్ మండలంలోని చిట్యాల్ గ్రామంలో గ్రామీణ ఎస్సై మిథున్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని, ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణపై యువకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సురేందర్, రాజు, సాయేందర్, రాజారెడ్డి, ప్రశాంత్, నారాయణ, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
'నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పరిరక్షించాలి' - హరితహారం
మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని నిర్మల్ గ్రామీణ ఎస్సై మిథున్ అన్నారు. నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
'నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా పరిరక్షించాలి'