హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్మల్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయం నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కడైతే హిందూ ధర్మాన్ని కాపాడగలుగుతామో అక్కడే ప్రశాంతత ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలు మతాల వారీగా విడదీసి అమలు చేస్తున్నారని ఆరోపించారు.
నిర్మల్లో ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర - HANUMAN VIJAYA YATRA IN NIRMAL
రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్మల్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయయాత్రను నిర్వహించారు. పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు.

నిర్మల్లో ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర