కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండల కేంద్రంలో హనుమాన్ దీక్ష చేస్తున్న స్వాములు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రధాన రహదారుల వెంట పిచికారీ చేశారు. వైరస్ పట్ల ప్రజలు భయాందోళనలకు గురికాకుండా... తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్వాములు సూచించారు.
కరోనా నివారణ చర్యల్లో హనుమాన్ భక్తులు.. రోడ్లపై హైపోక్లోరైడ్ పిచికారీ
కొవిడ్ నివారణ చర్యల్లో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందా మండలంలోని ప్రధాన రహదారుల వెంట హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని.. అవసరమైతేనే బయటకు రావాలని స్వాములు కోరారు.
రహదారులపై హైపోక్లోరైడ్ పిచికారీ చేసిన స్వాములు, నిర్మల్ కరోనా వార్తలు
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగేష్, మల్లేష్ యాదవ్, సంతోష్ యాదవ్, శంకర్, వినేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా