గండిరామన ఆలయంలో గురుపౌర్ణమి ఉత్సవాలు - guru pournami celebrations at gandiramana temple in nirmal
నిర్మల్ జిల్లా కేంద్రం శివారులో సహ్యాద్రి పర్వతశ్రేణుల దిగువన, పచ్చదనం పరుచుకున్న గుట్టల నడుమ భక్తుల కొంగుబంగారంగా అలరాలుతోంది గండిరామన దత్తసాయిబాబా ఆలయం. ఈ దేవాలయం గురుపౌర్ణమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది.
గురుపౌర్ణమిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లాకేంద్రంలోని గండిరామన దత్తసాయిబాబా ఆలయంలో వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈరోజు సాయిబాబాకు మంగళ స్నానం, అర్చన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో బాబా ఊరేగింపు జరగనుంది. రేపు గురుపౌర్ణమిని పురస్కరించుకుని అన్నదానం నిర్వహించనున్నారు. పట్టణానికి చెందిన కామోల్, చించాల, ఎడ్బిడ్, వెంకటాపూర్, భజన మండళ్లు ఉత్సవాల్లో పాల్గొననున్నాయి. ఈ వేడుకల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
- ఇదీ చూడండి : ఐసీసీ నిబంధనలపై గౌతమ్ గంభీర్ మండిపాటు
TAGGED:
nirmal