నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాం గ్రామం ప్రజలు నాలుగు సంవత్సరాలుగా ముంపునకు గురవుతున్నారు. భారీ వర్షాల కారణంగా రంగారావు ప్రాజెక్టు వెనకతట్టు నుంచి వరద నీరు వచ్చి తమ ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. ఆర్డీవో రాజు, తహసీల్దార్ నర్సయ్య, డీఎస్పీ నర్సింగ్ రావు, భైంసా గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ ముంపు ప్రాంతాలను సందర్శించి... అక్కడి పరిస్థితులు గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.
'పాములు, తేళ్లతో సావాసం చేస్తున్నాం... మమ్మల్ని కాపాడండి' - నిర్మల్లో ముంపు ప్రాంతాలు
నాలుగేళ్లుగా తమ ప్రాంతం ముంపునకు గురువుతుందని... ఇళ్లలోకి పాములు, తేళ్లు వంటి విష జంతువుల వస్తున్నాయని భైంసా మండలంలోని గుండెగాం గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ముంపు బాధితురాలు పవార్ విరాబాయి అధికారుల వద్దకు వచ్చి.. తన గోడును వెల్లబోసుకుంది. ''అయ్యా ... ! మమ్మల్ని బ్రతికించండి. మీ కాళ్లు మొక్కి, చేతులు జోడించి చెబుతున్న సారూ అంటూ పాధాభివందనం చేసింది. ఇంట్లోకి నీళ్లు వచ్చాయని... సామాన్లు బయటకు తీసుకెళ్తుంటే... ఓ పాము నా కాళ్లకు చుట్టుకుంది సారు... ఇలాగైతే మాకు చావు తప్ప మరో మార్గం కనిపించడంలేదు.'' అంటూ బాధను వెళ్లబుచ్చుకుంది. అధికారులతో మాట్లాడి... త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ నర్సయ్య తెలిపారు.
ఇదీ చూడండి:ముంపులోనే జీవనం... కొనసాగుతున్న వరద ఉద్ధృతి