తెలంగాణ

telangana

ETV Bharat / state

హ‌రిత‌హారం ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి: ఇంద్రకరణ్​రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్.. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ, జీవ‌వైవిధ్య సంర‌క్షణ‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు అటవీ, పర్యవరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి. ప్రజలందరికీ జీవవైవిధ్య చ‌ట్టంపై అవగాహన కల్పించేందుకు 'జీవ‌వైవిధ్య ర‌చ్చ బండ' అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

indrakaran reddy
హ‌రిత‌హారం ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి: ఇంద్రకరణ్​రెడ్డి

By

Published : May 23, 2021, 7:08 AM IST

జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ సాధ్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అన్నారు. అంత‌ర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సంద‌ర్భంగా రాష్ట్ర జీవ‌వైవిధ్య మండ‌లి వర్చువల్ విధానంలో నిర్వహించిన స‌మావేశంలో మంత్రి పాల్గొన్నారు. “

"మా ప‌రిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి" అన్న గతేడాది నినాదానికి కొన‌సాగింపుగా“"మేమూ ప‌రిష్కారంలో భాగం" అనే థీమ్​తో ఈ ఏడాది వేడుకను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరం ప్రకృతితో కలిసి సామరస్యంగా జీవించడం ఎంతో అవసరమన్నారు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి. మానవ జీవితంపై ప్రకృతి విపత్తులు, కరోనా వంటివి ఒకదాని వెంట మరొకటి దాడిచేస్తున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యధార్థాన్ని గ్రహించి... ముందుకుసాగాలని సూచించారు. అభివృద్ధి పేరిట ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కోల్పోయామన్న మంత్రి... మిగిలి ఉన్న సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. ప‌ర్యావ‌ర‌ణ పరిరక్షణ, జీవ‌వైవిధ్య సంర‌క్షణ‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హ‌రిత‌హారం ఫలితాలు మన కళ్లముందు కనిపిస్తున్నాయని... పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించ‌డంతో రాష్ట్రంలో నాలుగు శాతం పచ్చదనం పెరిగిందన్నారు. పునరుద్ధరణ చర్యలతో అడ‌వుల్లో వృక్ష, జంతు జాతులు బాగా వృద్ధిచెందాయన్నారు.

ప్రత్యేక లక్షణాలను సొంతం చేసుకొని తెలంగాణకు తలమానికమైన‌ మన్ననూరు తూర్పు పొడ‌ ఎడ్లను స్వదేశీ జాతి ప‌రిర‌క్షణ‌గా భార‌త ప్రభుత్వం గుర్తించింద‌ని మంత్రి చెప్పారు. గ్రామాల్లోని జీవవైవిధ్య యాజ‌మాన్య కమిటీలు ఆయా ఆవాస ప్రాంతాల్లోని సంప్రదాయ, జీవవైవిధ్య వనరుల్ని సంరక్షించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. ప్రజలందరికీ జీవవైవిధ్య చ‌ట్టంపై అవగాహన కల్పించేందుకు 'జీవ‌వైవిధ్య ర‌చ్చ బండ' అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

హ‌రిత‌హారం ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి: ఇంద్రకరణ్​రెడ్డి

ఇవీచూడండి:మూడో దశ వ్యాక్సినేషన్​​కు సిద్ధమవుతున్న ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details