రైతులు తమ పంటను దళార్లకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవాలని నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని చిట్యాల్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
చిట్యాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - నిర్మల్ జిల్లా వార్తలు
నిర్మల్ జిల్లా చిట్యాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి ప్రారంభించారు
chityal, nirmal district, paddy purchasing center,ikp
కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని విక్రయించుకోవాలని రామేశ్వర్ రెడ్డి సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1888, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1868 ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడకంటి రమేశ్ రెడ్డి, ఉప సర్పంచ్ బొంపాల చిన్నయ్య, వార్డు సభ్యులు యార సాయేందర్, వీడీసీ సభ్యులు గడ్డం నర్సారెఢ్ఢి, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు