తెలంగాణ

telangana

ETV Bharat / state

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి' - తెలంగాణ వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ ఛైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డి సూచించారు. మద్దతు ధర కోసమే ప్రభుత్వ వీటిని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పారు.

grain purchase center inaugurated, thalveda grain purchase center
నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు, తల్వేదలో ధాన్యం కొనుగోలు కేంద్రం

By

Published : May 7, 2021, 5:15 PM IST

రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పీఏసీఎస్ ఛైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డి అన్నారు. వీటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. నిర్మల్ జిల్లా తల్వేద గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ స్వామి, ఏవో వసంత్ రావు, ఏఈవో హర్షిత, పీఏసీఎస్ డైరెక్టర్లు లింగారెడ్డి, విజయశేఖర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఒకే మంచంపై మృతదేహం, బాధితుడు

ABOUT THE AUTHOR

...view details