ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని ఎఫ్.ఎస్.సి.ఎస్ ఛైర్మన్ ధర్మాజిగారి రాజేందర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటలను విక్రయించుకోవాలని సూచించారు.
'ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుంది' - latest news on Government Will Protect All Farmers
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎఫ్.ఎస్.సి.ఎస్ ఛైర్మన్ ధర్మాజిగారి రాజేందర్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుంది'
ప్రభుత్వం నాణ్యత గల శనగలను క్వింటాల్‌కు రూ.4,875ల మద్దతు ధర అందజేస్తుందని.. తమ ఉత్పత్తులను దళారులకు విక్రయించి రైతులు నష్టపోవద్దని సూచించారు. మార్కెట్ యార్డులో భవిష్యత్తులో మొక్కజొన్నలనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'వనరుల పెంపకం, దుబారా తగ్గింపుపై సమాలోచనలు'