తెలంగాణ

telangana

గల గల పారుతున్న గోదావరి

By

Published : Oct 22, 2019, 6:27 PM IST

దక్షిణ గంగగా పిలుచుకునే జీవనది..  గోదావరి జలకళను  సంతరించుకుంది. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయడం వల్ల గోదారమ్మ పరుగులు పెడుతోంది.

గోదావరికి జలకళ

గోదావరికి జలకళ

వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్​ ప్రాజెక్టులోకి భారీ నీరు చేరింది. నిండుకుండలా మారిన ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు 75వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూడు సంవత్సరాలుగా గోదావరి నదిలో నీరు లేక వెలవెలబోయింది. ప్రస్తుతం నీటితో కళకళలాడటం చూసి అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నీరు నిర్మల్​ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో యాసంగి పంటకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ABOUT THE AUTHOR

...view details