నిర్మల్ జిల్లా బాసరలో గోదారమ్మకు ఘనంగా గంగా హారతి నిర్వహించారు. అనంతరం అభిషేకం, శివార్చన చేశారు.
గోదారమ్మకు రష్యా భక్తుల హారతి - బాసరలో గంగా హారతి
బాసర శ్రీజ్ఞాన సరస్వతీ పుణ్యక్షేత్రంలో గోదారమ్మకు వైభవంగా గంగా హారతి నిర్వహించారు. శ్రీవేద భారతి విద్యానందగిరి స్వామి చేతుల మీదుగా రష్యా భక్తులు గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
గోదారమ్మకు రష్యా భక్తుల హారతి
శ్రీ వేద భారతి విద్యా నందగిరి స్వామి చేతుల మీదుగా రష్యాకు చెందిన భక్తులు నక్షత్ర హారతి, నాగహారతి, కుంభ హారతులు నిర్వహించి.. విశేష పూజలు చేశారు.
వేదమంత్రోచ్ఛరణల మధ్య పవిత్ర గోదారమ్మకు కన్నుల పండువగా హారతినిస్తున్న దృశ్యం చూసి భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.