నిర్మల్ జిల్లా కుటుంబ సభ్యుల జాడ కోసం బధిరురాలైన గీత బాసర పట్టణానికి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సాయంతో కుటుంబ సభ్యుల జాడ కోసం వచ్చింది. 20 ఏళ్ల కిందట తప్పిపోయి పాకిస్థాన్ చేరింది. ఐదేళ్ల కిందట విదేశాంగశాఖ సహకారంతో స్వదేశానికి వచ్చిన గీత... స్వచ్ఛంద సంస్థ సహకారంతో కుటుంబీకుల జాడ కోసం వెతుక్కుంటూ బాసర వచ్చింది.
గీత బధిరురాలు కావడం వల్ల తాను చిన్నప్పుడు ఉన్న ప్రాంతంలో గోదావరి పక్కన గుడి, రైల్వే బ్రిడ్జ్ ఉన్నట్లు ఆమె సొసైటీ వారికి తెలిపింది. ఈరోజు గీతను బాసరకు తీసుకుని వచ్చారు. దివ్యాంగురాలు గీత 20 ఏళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ ఉన్న సేవ సంస్థ ఈద్ ఫౌండేషన్‌లో 15 సంవత్సరాలు ఉంది. ఫౌండేషన్ వారు గీత అని నామకరణం చేశారు.