మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నేటి యువత నడవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్కులోని బాపూజీ విగ్రహానికి జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మీతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
'మహాత్మా గాంధీ అడుగుజాడలో యువత నడవాలి'
నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ గుర్తు చేసుకున్నారు. అహింసా మార్గంతో స్వాతంత్య్రం సాధించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. జడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మితో కలిసి నివాళులు అర్పించారు
'మహాత్మా గాంధీ అడుగుజాడలో యువత నడవాలి'
అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీమహాత్ముడేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు పాలనాధికారి హేమంత్, పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.