నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విభాగ్ స్థాయి ఖేల్ ఖుత్ పోటీలు నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి సుమారు 450 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాగిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటలూ అవసరమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. శిశు మందిర్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పుతూ ప్రయోజకులను చేస్తారన్నారు. 1050 మంది విద్యార్థులతో రాష్ట్రం మొత్తంలోనే సుభద్ర వాటిక శిశుమందిర్ పాఠశాల ముందుందని విఠల్‌రెడ్డి తెలిపారు.
'విద్యార్థులకు విద్యతో పాటు ఆటలూ అవసరం' - GAMES COMPITIONS HELD IN BAINSA SISHUMANDHIR SCHOOL
విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటుగా... క్రీడలూ అవసరమని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్మల్ జిల్లా భైంసాలో శిశుమందిర్ పాఠశాలలో నిర్వహించిన ఖేల్ ఖుత్ పోటీలకు హాజరై... బహుమతులు అందజేశారు.

GAMES COMPITIONS HELD IN BAINSA SISHUMANDHIR SCHOOL