తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారనే సమాచారంతో నిర్మల్ జిల్లా కేంద్రంలో సోఫి నగర్​ కాలనీలోని ఓ ఇంట్లో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

By

Published : Sep 8, 2020, 5:15 PM IST

fourteen Quintons of ration rice is seized in nirmal
నిర్మల్​లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం

నిర్మల్ జిల్లా కేంద్రంలో సోఫి నగర్ కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అహ్మద్​ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా.. వేరే రాష్ట్రాలకు తరలించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని డీటీ ఎన్​ఫోర్స్​మెంట అధికారి ప్రకాశ్ రాఠోడ్​ హెచ్చరించారు.

ఇవీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details