తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికార పార్టీ రైతులకు ఓ న్యాయం.. పేదోళ్లకు మనో న్యాయమా?: ఎంపీ - నిర్మల్​ జిల్లా సదర్​మట్​ బ్యారేజీ

నిర్మల్​ కలెక్టరేట్ ఎదుట సదర్​మాట్​ బ్యారేజీ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాకు ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు మద్ధతు తెలిపారు.

Formers Protest At Nirmal Collectorate
నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ధర్నా

By

Published : Jul 4, 2020, 4:26 PM IST

నిర్మల్​ జిల్లాలోని మామడ మండలం పోన్కల్​ గ్రామంలో నిర్మిస్తున్న సదర్​మాట్​ బ్యారేజీలో భూములు కోల్పోయిన రైతులు నష్ట పరిహారం కోసం కలెక్టర్​ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు, భాజపా నాయకులు మద్ధతు తెలిపారు.

రెండేళ్లుగా ప్రభుత్వానికి, అధికారులకు నష్టపరిహారం కోసం విన్నవించుకున్నా.. స్పందన కరువైందని ఎంపీ బాపూరావు అన్నారు. అధికార పార్టీకీ చెందిన భూ బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి.. పేద రైతులకు చెల్లించకుండా.. నష్టపరిహారం విషయంలో రాజకీయం చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు పరిహారం చెల్లించకపోతే.. పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బాధితులతో కలిసి ఎంపీ కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమన్న, రామ్​నాథ్​, అరవింద్​, నర్సయ్య, లింగారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఆకలి చావుల్లేవు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details