స్ఫూర్తి ప్రదాత, ఆదర్శప్రాయుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్ఫూర్తి ప్రదాత.. పీవీ నరసింహారావు: ఎస్పీ శశిధర్ రాజు - మాజీ ప్రదాని పీవీ నరసింహరావు తాజావార్తలు
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు భాషాకోవిదుడు, భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు అద్భుతమని కొనియాడారు.
![స్ఫూర్తి ప్రదాత.. పీవీ నరసింహారావు: ఎస్పీ శశిధర్ రాజు Former Prime Minister PV Narasimha Rao 100 years birth day celebrations in Nirmal district SP office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7802848-376-7802848-1593324956233.jpg)
స్ఫూర్తి ప్రదాత.. పీవీ నరసింహారావు
సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా దేశాన్ని స్వావలంబన వైపు మళ్లించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు జాన్ దివాకర్, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.