కొవిడ్ మహమ్మారిపై పోరులో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన సోదరుడు అల్లోల సురేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన భోజన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Minister IK Reddy : కరోనా యోధుల సేవలు అభినందనీయం - telangana forest minister indrakaran reddy
కరోనా వంటి విపత్కర సమంలో ప్రాణాలకు తెగించిన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. వారి సేవలను కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోజన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్‌లో భోజనం పంపిణీ
మరో రెండ్రోజుల్లో ఐకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేయి మందికి నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్య సిబ్బందికి, రోగులకు భోజనం, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లోల సురేందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, తెరాస యువజన నేత అల్లోల గౌతమ్ రెడ్డి, రాజ్‌కిరణ్ రెడ్డి, నితీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పాల్గొన్నారు.