లాక్డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు, వలస కూలీలకు చేయూతనందిచడానికి నిర్మల్ జిల్లాలోని శ్రీ ధర్మశాస్త్ర యూత్ సభ్యులు ముందుకొచ్చారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు, పనులు లేక ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు భోజన పొట్లాలను తాగునీటి ప్యాకెట్లను అందజేశారు.
తాము సైతం సాయం అందిస్తామంటున్న యువత - నిర్మల్ జిల్లా తాజా వార్త
కరోనా గడ్డుకాలంలో ప్రజల్లో మానవత్వం వికసిస్తుంది. దాతృత్వం పరిమలిస్తుంది. తాముసైతం కరోనాకట్టడికై తమవంతు సాయం అందిస్తామంటూ ముందుకొస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు శ్రీ ధర్మశాస్త్ర యూత్ ఆహారపొట్లాలు వితరణ చేస్తున్నారు.
తాము సైతం సాయం అందిస్తామంటున్న యువత
రహదారులపై ఉన్న యాచకులకు పట్టెడన్నం పెట్టి వారి ఆకలి తీర్చుతున్నారు. కష్టకాలంలో తాముసైతం సాయం అందిస్తామంటూ ఇలా ముందుకొచ్చారు. పట్టణంలోని రాంనగర్ చెందిన ముత్యాల శ్రీనివాస్, రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులు తమ నివాసంలోనే భోజనాలు తయారు చేసి పేదల ఆకలితీర్చేందుకు కృషి చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఇకపై మూడు విభాగాలుగా కరోనా ఆసుపత్రులు