నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికై 6 సంవత్సరాల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాలకై కౌన్సిలింగ్ కోసం ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. మొదటి దశ కింద 1,193 మంది విద్యార్థుల జాబితాను ఏవో రాజేశ్వరరావు విడుదల చేశారు.
ఆర్జీయూకేటీకి వచ్చిన మొత్తం దరఖాస్తులు 40,158 కాగా.. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 40 దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో 1,193 మంది విద్యార్థులకు ఎంపిక చేసినట్లు వివరించారు. వీరికి నవంబర్ 3 నుంచి 7 వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. ఒక విద్యార్థితో పాటు ఒకరే హాజరు కావాలని సూచించారు.