తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు... - farmers problems

నిర్మల్​ జిల్లా నర్సాపూర్​(జి) మండలం రాంపూర్​ వద్ద రైతులు ఆందోళన చేశారు. కేంద్రం నుంచి కొనుగోలు చేసిన మక్కలు తరలించి... మిగిలిన ధాన్యం కొనాలంటూ... రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.

farmers protest for corn purchasing in niramal district
రోడ్డెక్కిన మొక్కజొన్న రైతులు...

By

Published : May 16, 2020, 3:58 PM IST

కొనుగోలు చేసిన మొక్కజొన్నను కేంద్రం నుంచి తరలించాలంటూ నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం రాంపూర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే కొనుగోలు చేసిన మొక్కజొన్నను తరలించకపోవటం వల్ల మిగిలిన మక్కల కొనుగోలులో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.

అధికారులు స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రం నుంచి తరలించాలని రహదారి మీద భీష్మించుకు కూర్చున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు కలెక్టర్... స్థానికంగా ఉన్న కులసంఘ భవనానికి తరలిస్తామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

ABOUT THE AUTHOR

...view details