నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి పనులన్నీ మానుకొని, యూరియా బ్యాగుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిపడా యూరియా బస్తాలు అందిచేవరకు ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు... - యూరియా
యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు...