తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన - ఖానాపూర్​ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం వార్తలు

నిర్మల్​ జిల్లాలో రాత్రి కురిసిన అకాల వర్షంతో ఖానాపూర్​ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు.

Farmers are concerned about buying starchy grain
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

By

Published : Dec 26, 2019, 1:02 PM IST

అకాల వర్షం.. అధికారుల అలసత్వం రైతుల ఆందోళనకు దారి తీసింది. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసిపోయింది. ఫలితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఇన్ని రోజులు మ్యాచర్​ వచ్చినా అధికారులు కొనుగోలు చేయలేదంటూ మండిపడ్డారు.

ఇప్పటికే ధాన్యం విక్రయించేందుకు వచ్చి వారం రోజులు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మ్యాచర్ పేరుతో కాలయాపన చేస్తే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: స్వచ్ఛ ఇంధనంతో పచ్చని జీవితం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details