పంట రక్షణకని వేస్తే.. రైతును బలిగొన్న విద్యుత్ కంచె - ప్రాణం తీసిన కంచె
తన పంట రక్షణకై వేసిన కంచే తన ప్రాణం తీసింది. జంతువుల నుంచి పంటను కాపాడుకోగలిగాడు కానీ తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడు ఆ రైతు.
![పంట రక్షణకని వేస్తే.. రైతును బలిగొన్న విద్యుత్ కంచె FARMER DIED WITH CURRENT SHOCK IN NIRMAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6234510-thumbnail-3x2-pppp.jpg)
FARMER DIED WITH CURRENT SHOCK IN NIRMAL
అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ కంచె ఆ అన్నదాత పాలిట శాపంగా మారింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సాంగ్వి గ్రామంలో జరిగింది ఈ ఘటన. పంటకు నీరు పెడుతున్న క్రమంలో పంట రక్షణకు వేసుకున్న విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు రైతు మృతి చెందాడు.
విద్యుత్ షాక్తో రైతు మృతి