నిర్మల్ జిల్లా భైంసా మండలంలో ఎద్దుకు ఓ రైతు అంత్యక్రియలు నిర్వహించారు. వానల్ పాడ్ గ్రామానికి చెందిన రైతు రాము ఇంట్లో ఆవుకు 21 ఏళ్ల కిందట ఒక లేగ దూడ జన్మించింది. దాన్ని పుట్టినప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు. అది పెద్దయ్యాక వ్యవసాయంలో రైతుకు చోదోడు వాదోడుగా నిలిచింది. గత 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ పని చేయకపోయినా.. ఎద్దును పోషించారు.
ఎద్దుకు అంత్యక్రియలు జరిపించిన రైతు కుటుంబం - నిర్మల్ జిల్లా తాజా వార్తలు
రైతులకు నిత్యం వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా, పంట పొలాల్లో కష్ట జీవిగా ఉండేవి కాడెద్దులు. కానీ అవి పనిచేయలేని స్థితికి చేరినప్పుడు మాత్రం వాటిని పోషించడానికి స్తోమత లేక... దాని వల్ల వచ్చే లాభం లేదనుకోనో అమ్మకానికి పెడతారు. కానీ ఓ రైతు మాత్రం 21 ఏళ్లుగా పెంచుకున్న ఎద్దు... 5 ఏళ్లుగా ఏ పని చేయకున్నా ఎంతో ఇష్టంగా పోషించారు. అది బుధవారం మరణించడంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా భైంసాలో జరిగింది.
హిందూ సంప్రదాయం ప్రకారం ఎద్దుకు అంత్యక్రియలు
బుధవారం ఉదయం ఆ ఎద్దు మృతిచెందడంతో... హిందూ సంప్రదాయం ప్రకారం దానికి రైతు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంట్లో ఎద్దు పుట్టినప్పటి నుంచి తమకు కలిసొచ్చిందని రైతు రాము తెలిపారు. పంటలు బాగా పండాయని, ప్రతి పనిలోనూ విజయం సాధించామని అన్నారు. ఎద్దు మరణించడంతో చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కమిషనరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నం.. బాధితుడికి పోలీసుల ఆశ్రయం